Posts

రాయల సీమ లో జలపాతాలు

Image
కుందనకోట  జలపాతం రాయలసీమ waterfalls లలో చెప్పుకో దగిన జలపాతలలో కుంధనకోట జలపాతం ఒకటి. ఈ జలపాతం కుందనకోట గ్రామానికి సంబంధించినది. అందువలన ఇక్కడి జలపాతాన్ని కుందనకోట జలపాతం అని పిలవడం జరిగింది. కుందనకోట గ్రామం గురించి:- కుందనాకోట గ్రామం యాడికి మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉంది. ఈ గ్రామం యాడికి గ్రామలన్నిటకన్న చిన్నది. ఇక్కడి మొత్తం జనాభా  260, 2011 వ సంవత్సరం అంచనా ప్రకారం. ఇక్కడ అందరూ వ్యవసాయం మీదే ఆధారపడిన్నారు. కుందన కోట జలపాతాల గురించి:- కుందన కోట జలపాతo చాలా సహజ సిద్దంగా ఏర్పడినది. ఇక్కడ రెండు రకాల జలపాతాలను మనం చూడవచ్చు.ఒకటి నిటారుగా నీరు పై నుండి కిందకు జారుతుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. ఫొటో లు తీసుకోవడానికి చాలా మంచి ప్రదేశం..ఇంకొకటి కొంచెం ఎగువన వుంటుంది. ఈ జలపాతం ఏటవాలుగా కొండల మీద జారుతూ నీరు ప్రవహిస్తుంది. ఇక్కడ ఈత వచ్చిన వాళ్ళు ఈత కొట్టవచ్చు. ఈత కు మంచి సదుపాయం ఇక్కడ కలదు..                 ఈ కుందలకొట జలపాతం  ప్రకృతి అందంను ప్రతిబింబిస్తుంది. చాలా ప్రశాంతంగా అక్కడ పారే సెలయేరు శబ్దాన్ని క్షుణ్నంగా వినవచ్చు.. ఎటువంటి కాలుష్యం ఉండదు.చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.